33 శాతం మహిళా రిజర్వేషన్లు 2029లో నైనా అమలవుతాయా? : హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ రాధారాణి

33 శాతం మహిళా రిజర్వేషన్లు 2029లో నైనా అమలవుతాయా? : హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ రాధారాణి
  • రిటైర్డ్ జస్టిస్ రాధారాణి

ముషీరాబాద్, వెలుగు: పార్లమెంటు, శాసనసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు 2029 ఎన్నికల నాటికైనా అమలవుతాయా అని తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ రాధారాణి ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం బాగ్‌‌‌‌‌‌‌‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె మాట్లాడారు. రువాండా, కాంగో వంటి దేశాల్లో చట్టసభల్లో 60 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నారని, కానీ భారతదేశంలో మహిళల ప్రాతినిథ్యం ఇప్పటికీ 14 శాతం దాటకపోవడం విచారకరమన్నారు. 

ప్రస్తుతం న్యాయవ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని, గ్రామస్థాయిలో మహిళా ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు అసెంబ్లీ, పార్లమెంటులో మహిళలకు తగిన ప్రాతినిథ్యం ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, విద్యాసాగర్, ఉమామహేశ్వరరావు, ప్రసాద్, కామేష్‌‌‌‌‌‌‌‌బాబు, వీరయ్య, నాగలక్ష్మి, డీజీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.