ఆషికీ ఆగయీ.. స్టైలిష్ గా ప్రభాస్, పూజా హెగ్డే

ఆషికీ ఆగయీ.. స్టైలిష్ గా ప్రభాస్, పూజా హెగ్డే

ప్రభాస్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందుకే ఇన్నాళ్లూ అప్‌డేట్స్​ విష యంలో కాస్త స్లోగా ఉన్న టీమ్ ఇప్పుడు స్పీడ్ పెంచుతోంది. డిసెంబర్‌‌ 1న ‘నగు మోము తారలే’ అనే రొమాంటిక్ సాంగ్​ను రిలీజ్ చేయనున్నారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ నిన్న టీజర్​ వదిలారు. జస్టిన్ ప్రభాకర్ కంపోజ్ చేసిన ఈ పాటలోని మ్యూజిక్​ బిట్​కి, అందమైన విజు వల్స్​ని యాడ్​ చేసి టీజర్​ను కట్​ చేశారు. మోడర్న్​ డ్రెస్సుల్లో ప్రభాస్​, పూజా హెగ్డే ఎంతో స్టైలిష్‌గాను, అట్రాక్టివ్‌గాను ఉన్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని ప్రతి ఫ్రేమ్ ప్రూవ్ చేస్తోంది. లొకేషన్స్, సినిమాటో గ్రఫీ సూపర్బ్‌. హిందీ వెర్షన్ కోసం ఈ పాటను మిథున్ ట్యూన్ చేశాడు. ‘ఆషికీ ఆగయీ’ అంటూ అర్జీత్ సింగ్ పాడిన విధానం కూడా చాలా బాగుంది.