వింబుల్డన్ నుంచి వైదొలిగిన నాదల్

వింబుల్డన్ నుంచి వైదొలిగిన నాదల్

వింబుల్డన్ నుంచి రఫెల్ నాదల్ నిష్క్రమించాడు. క్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్‌‌ టేలర్‌‌ ఫ్రిట్జ్‌‌ (అమెరికా)పై అతికష్టం మీద నెగ్గి సెమీస్‌‌లోకి ప్రవేశించిన అతను..సెమీస్ నుంచి తప్పుకున్నాడు. పొత్తి కడుపు గాయంతో తీవ్రంగా బాధపడుతున్న నాదల్‌ వాకోవర్ ఇచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా ప్లేయర్  నిక్‌ కిరియోస్‌ నేరుగా ఫైనల్‌కు చేరుకున్నాడు. మరో సెమీస్లో జకోవిచ్తో కామెరూన్ నోరీ తలపడబోతున్నాడు. ఇందులో గెలిచిన ప్లేయర్..ఫైనల్లో నిక్ కిరియోస్తో టైటిల్ కోసం పోరాడనున్నాడు. 

టైటిల్ కంటే ఆరోగ్యం ముఖ్యం...
తాను కడుపు నొప్పితో బాధపడుతున్నందున టోర్నమెంట్ నుండి వైదొలగవలసి వచ్చిందని నాదల్ తెలిపాడు. ఈ నొప్పితో సెమీస్, ఫైనల్ గెలవడం కష్టమన్నాడు.  తనకు టైటిల్ కంటే ఆరోగ్యమే ముఖ్యమైన విషయమని..అయినప్పటికీ తాను క్రీడకు దూరంగా ఉండలేను కాబట్టి వింబుల్డన్ కోసం ఎంత కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు. 

నాదల్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్,ఫ్రెంచ్ ఓపెన్‌లలో విజయం సాధించాడు. .వింబుల్డన్,  యూఎస్ ఓపెన్లలో కూడా గెలిచి కాలెండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్ను పూర్తి చేయాలని ఆశపడ్డాడు. కానీ గాయం కారణంగా వింబుల్డన్  టోర్నీ నుంచి వైదొలిగాడు.  1969లో రాడ్ లావర్ తర్వాత క్యాలెండర్-ఇయర్ స్లామ్‌ను పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా అవతరించాలని ఆశించాడు.