Australian open: ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి రఫెల్ నాదల్ ఔట్

Australian open: ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి రఫెల్ నాదల్ ఔట్

డిఫెండింగ్ ఛాంపియన్ రఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్‌లో వైదొలిగాడు. అమెరికన్ ప్లేయర్ మెకెంజీ మెక్‌డొనాల్డ్‌తో వరుస సెట్లలో ఓటమిపాలై  టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మెక్‌డొనాల్డ్ 6-4, 6-4, 7-5తో నాదల్‌ను ఓడించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. అయితే, 65 ర్యాంక్ లో ఉన్న మెక్‌డొనాల్డ్ కు కెరీర్ లో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.

మ్యాచ్ మొదటి రౌండ్ లో నాదల్ తుంటికి గాయమైంది. దీంతో రెండవ రౌండ్ లో మెడికల్ టైం ఔట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది కూడా నాదల్ ఓటమికి ఒక కారణమైంది. మొదటి మ్యాచ్‌లో రఫెల్ నాదల్ డెబ్యూటెంట్‌ జాక్ డ్రాపర్‌‌పై విజయం సాధించి రెండవ రౌండ్‌లోకి అర్హత సాధించాడు.