SVBC చైర్మన్ పదవికి కె.రాఘవేంద్రరావు రాజీనామా

SVBC చైర్మన్ పదవికి కె.రాఘవేంద్రరావు రాజీనామా

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవికి సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు రాజీనామా చేశారు. వయోభారం వల్ల చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యానికి, సిబ్బందికి వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలని  రాఘవేంద్రరావు ఆకాంక్షించారు.

ఏప్రిల్ 24, 2018 నాడు ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ గా రాఘవేంద్రరావు పదవీ బాధ్యతలు తీసుకున్నారు. గతంలో టీటీడీ బోర్డ్ మెంబర్ గానూ రాఘవేంద్రరావు పనిచేశారు.