వన్డే టీమ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా రాహుల్‌‌‌‌‌‌‌‌.. జట్టులోకి కోహ్లీ, రోహిత్ రీ ఎంట్రీ

వన్డే టీమ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా రాహుల్‌‌‌‌‌‌‌‌.. జట్టులోకి కోహ్లీ, రోహిత్ రీ ఎంట్రీ

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌కు టీమిండియాను ప్రకటించారు. ఆదివారం సమావేశమైన సెలెక్టర్లు 15 మందితో కూడిన టీమ్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేశారు. మెడ గాయం కారణంగా రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ అందుబాటులో లేకపోవడంతో కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ను కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా నియమించారు. సీనియర్లు రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ, విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీతో పాటు ఎనిమిది నెలల తర్వాత స్పిన్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర జడేజా మళ్లీ వన్డే సెటప్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు. 

ఇండియా–ఎ తరఫున రాణించిన రుతరాజ్‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌తో పాటు యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌కు పిలుపు అందింది. పేసర్లు బుమ్రా, సిరాజ్‌‌‌‌‌‌‌‌తో పాటు స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌కు రెస్ట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. మిగతా స్పిన్నర్లలో కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌, వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ సుందర్‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌ లభించింది. భారీ మార్పులు లేకుండానే సెలెక్టర్లు టీమ్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేశారు. 

జట్టు: కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ, యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌, విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ, తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ, రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌, వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ సుందర్‌‌‌‌‌‌‌‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌, నితీశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, హర్షిత్‌‌‌‌‌‌‌‌ రాణా, రుతురాజ్‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌‌‌‌‌ కృష్ణ, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, ధ్రువ్‌‌‌‌‌‌‌‌ జురెల్‌‌‌‌‌‌‌‌.