సొంత జట్టుతో కొట్లాట.. పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయం

సొంత జట్టుతో కొట్లాట.. పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయం

ఐపీఎల్ (IPL) లో రచ్చ చేసిన పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ శశాంక్ సింగ్ (Shashank Singh) సొంత స్టేట్ టీమ్‌తోనే ఇప్పుడు లొల్లి పెట్టుకొని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఛత్తీస్‌గఢ్ స్టేట్ క్రికెట్ సంఘం (CSCS) తనకు అస్సలు సపోర్ట్ ఇయ్యలేదని, ఏమాత్రం చెప్పకుండా టీమ్‌ నుంచి పక్కనబెట్టిందని ఆరోపించాడు. అందుకే ఆ టీమ్‌ను వదిలేసి, వచ్చే 2026–27 డొమెస్టిక్ సీజన్ నుంచి పాండిచ్చేరి (Pondicherry) తరఫున ఆడబోతున్నట్టు చెప్పేసిండు. దీనికి సంబంధించి ఛత్తీస్‌గఢ్ బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కూడా తీసుకున్నాడు.

గాయపడితే పట్టించుకోలే.. అడిగితే అసలు జవాబే లేదు: 
శశాంక్ సింగ్ మాట్లాడుతూ.. గత సీజన్‌లో నాకు భుజం, వేలికి తీవ్ర గాయాలైనయి. ఆ సమయంలో ఛత్తీస్‌గఢ్ క్రికెట్ అసోసియేషన్ నన్ను అస్సలు పట్టించుకోలే, సపోర్ట్ కూడా చేయలే.. గాయం తగ్గినంక కూడా ఛత్తీస్‌గఢ్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ (CCPL 2026) ప్లేయర్ల లిస్టులకెల్లి నా పేరు తీసేసిండ్రు. బెంగళూరుల జరిగిన ప్రీ-సీజన్ క్యాంప్‌కి కూడా నన్ను పిలవలే.. నా పేరు ఎందుకు తీసేసిండ్రు? అని అడిగితే అసోసియేషన్ వాళ్లు జవాబు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేసిండు.

నేను ఐపీఎల్ మాత్రమే ఆడతాననడం అబద్ధం: 
తాను ఐపీఎల్ (IPL) ఒక్కటే ఆడడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నానని, డొమెస్టిక్ మ్యాచ్‌లను లైట్ తీసుకుంటున్నానని వచ్చిన వార్తలను శశాంక్ సింగ్ తీవ్రంగా ఖండించాడు. నేను డొమెస్టిక్ మ్యాచ్‌లు ఆడకుండా కేవలం ఐపీఎల్ ఆడటానికే చూడట్లే.. గత సీజన్ (2023–24 ) లోనే డొమెస్టిక్ వైట్ బాల్ మ్యాచ్‌లలో బెస్ట్ ఆల్‌రౌండర్ ప్రదర్శన ఇచ్చినందుకు బీసీసీఐ నాకే ప్రతిష్టాత్మకమైన లాలా అమర్‌నాథ్ అవార్డు ఇచ్చింది. ఇండియాలోనే బెస్ట్ ఆల్‌రౌండర్‌గా నిలిచినా నేను డొమెస్టిక్ ఆడా అనడం ఏంది? అని ప్రశ్నించాడు. 

డొమెస్టిక్, ఐపీఎల్‌లో మాస్ రచ్చ: 
గత కొంతకాలంగా దేశవాళీ మ్యాచ్‌లలోనూ, ఐపీఎల్‌లోనూ శశాంక్ కిర్రాక్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. 

* 2024–25 డొమెస్టిక్ రికార్డు: విజయ్ హజారే ట్రోఫీలో 7 మ్యాచ్‌లలోనే 450 రన్స్, 11 వికెట్లు తీసిండు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్‌లలో 188 రన్స్ కొట్టిండు.

* ఐపీఎల్ 2025లో విధ్వంసం: పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 ఫైనల్‌కి పోవడంలో శశాంక్ కీలక పాత్ర పోషించాడు. 153.51 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 350 రన్స్ కొట్టిండు. బెంగళూరుతో జరిగిన ఫైనల్లోనైతే కేవలం 30 బంతుల్లో 61 రన్స్ (నాటౌట్)తో చెలరేగాడు. 

పాండిచ్చేరితో కొత్త ఇన్నింగ్స్: 
వచ్చే సీజన్ నుంచి రెడ్-బాల్ (రంజీ) క్రికెట్‌కి కొద్దిగా గ్యాప్ ఇచ్చి, వైట్-బాల్ (T20, ODI) ఫార్మాట్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టాలని శశాంక్ సింగ్ ఫిక్స్ అయ్యాడు. టీ20ల్లో తన 4 ఓవర్ల కోటా పూర్తిగా బౌలింగ్ వేసే పక్కా ఆల్‌రౌండర్‌గా నిలబడాలనేదే తన మెయిన్ గోల్ అని చెప్పిండు. 2018ల ముంబైని వదిలేసి మంచి ఛాన్స్‌ల కోసం ఛత్తీస్‌గఢ్‌కు వచ్చిన శశాంక్, ఇప్పుడు ఆ అసోసియేషన్‌తో గొడవపడి బయటికొచ్చి పాండిచ్చేరి జట్టుతో తన డొమెస్టిక్ కెరీర్‌లో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడు.