పెళ్లి గురించి అందుకే ఆలోచించలేదు : రాహుల్‌ గాంధీ

 పెళ్లి గురించి అందుకే ఆలోచించలేదు :  రాహుల్‌ గాంధీ

ఇంతవరకు పెళ్లి చేసుకోకపోవటంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.  రాహుల్‌ ఇటీవల రాజస్థాన్‌లో పర్యటించిన సందర్భంగా జైపుర్‌లోని మహారాణి కళాశాల విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

మీరు స్మార్ట్‌గా, అందంగా ఉంటారు. పెళ్లి గురించి ఎందుకు ఆలోచించలేదని ఓ యవతి రాహుల్ ను ప్రశ్ని్ంచగా..   తాను పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి , తన పనికి అంకింతం కావడం వలనే  పెళ్లి చేసుకోలేదని చెప్పారు.  ఇక  కాకర కాయ, బఠానీలు, బచ్చలికూర తప్ప మిగతావన్ని తింటానంటూ చెప్పుకొచ్చారు. తన ముఖానికి ఎప్పుడూ సబ్బు, క్రీం పూయలేదని.. కేవలం నీళ్లతోనే ముఖం కడుగుతానని చెప్పారు. 

ఇదిలా ఉండగా.. లారీ డ్రైవర్లు, మెకానిక్‌లు, రైల్వే కూలీలు, వడ్రంగి పనివారు ఇలా సమాజంలోని ఆయా వర్గాలతో రాహుల్‌ గాంధీ మమేకమవుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ నుంచి రాయ్‌పుర్‌ వరకు సాధారణ వ్యక్తిలా ట్రైన్‌లో ప్రయాణించారు