
దేశ వ్యాప్తంగా కులగణనకు ఒప్పుకున్నందుకు ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పారు రాహుల్ గాంధీ . కేంద్రం ఏ కారణంగానైనా కులగణనకు ఒప్పుకున్నా సంతోషమేనన్నారు. కులగణనలో తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు రాహుల్ గాంధీ. బీహార్ లో కులగణనకు తెలంగాణలో కులగణనకు తేడా ఉందన్నారు. తెలంగాణలో కులగణన పారదర్శకంగా జరిగిందన్నారు. కులగణనకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు చెప్పారు రాహుల్.
కులగణన ఎప్పుటిలోగా చేస్తారో చెప్పాలన్నారు రాహుల్. బడ్జెట్ లో కులగణనకు నిధులు కేటాయించాలన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ రిజర్వేషన్ అవసరమని చెప్పారు. దేశ అభివృద్ధి కులగణనతోనే సాధ్యమని తెలిపారు. కులగణన దేశ అభివృద్ధికి తొలి అడుగు అని అన్నారు. కులగణనతోనే ప్రతీ వర్గానికి న్యాయం జరుగుతుందన్నారు. కులగణన ద్వార ప్రజలకు అధికార భాగస్వామ్యం కల్పిస్తామన్నారు. ఇన్నాళ్లు మోదీ సర్కార్ కులగణనపై నిర్లక్ష్యం వహించిందన్నారు రాహుల్. కులగణనతో దేశ ఆర్థికి పరిస్థితి మారుతుందన్నారు.
►ALSO READ | 94 ఏళ్ల తర్వాత దేశ వ్యాప్తంగా కుల గణన : కేంద్రం సంచలన నిర్ణయం
పహల్గామ్ ఉగ్రదాడిని దేశమంతా ఖండిస్తుందన్నారు రాుమల్. కేంద్రం ఏ చర్య తీసుకున్నా మద్దతిస్తామని చెప్పామన్నారు. ప్రధాని మోదీ ఎలాంటి చర్య తీసుకుంటారో చూద్దామన్నారు.