94 ఏళ్ల తర్వాత దేశ వ్యాప్తంగా కుల గణన : కేంద్రం సంచలన నిర్ణయం

94 ఏళ్ల తర్వాత దేశ వ్యాప్తంగా కుల గణన : కేంద్రం సంచలన నిర్ణయం

దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.. 2025లో జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టాలని నిర్ణయించింది కేంద్రం. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మేరకు  సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో 94 ఏళ్ళ తర్వాత దేశవ్యాప్తంగా కులగణన జరగనుంది. ఇదొక చారిత్రాత్మక నిర్ణయమనే చెప్పాలి.

1931 లో కులగణన తర్వాత 2011 దాకా కులగణన జరగలేదు. 2011లో సామజిక ఆర్థిక కులగణన చేపట్టినప్పటికీ అది పూర్తిస్థాయి కులగణన కాదని విమర్శలున్నాయి. ఈ సర్వేలో సమగ్ర కులజాబితా వెల్లడించలేదని విమర్శలున్నాయి. అయితే.. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటూ కాంగ్రెస్ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది.. ఎట్టకేలకు ఇవాళ జరిగిన క్యాబినెట్ భేటీలో కాంగ్రెస్ డిమాండ్ కు ఓకే చెప్పింది మోడీ సర్కార్.

త్వరలోనే జనాభా లెక్కలన కార్యక్రమం జరగబోతుందని.. అందులోనే కుల గణన కూడా చేయనున్నట్లు స్పష్టం చేశారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కులగణన పేరుతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సర్వే చేయించిందని.. ఆయా రాష్ట్రాల సర్వేలో పారదర్శకత లేదని అన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కులాల అసలు సంఖ్య జనాభా లెక్కల్లో తేలుతుందని అన్నారు.