హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో విచారణ జరుగుతోంది. ఆదివారం (ఫిబ్రవరి 1) మధ్యాహ్నం 3 గంటలకు విచారణ స్టార్ట్ కాగా.. ఐదుగురు అధికారుల సిట్ బృందం కేసీఆర్‌ను ప్రశ్నిస్తోంది. ఈ కేసులో సాక్ష్యులు, నిందితులు ఇచ్చిన వాంగుల్మాల ఆధారంగా సిట్ బృందం కేసీఆర్‌పై ప్రశ్నలు సంధిస్తోంది.
కేసీఆర్ స్టేట్మెంట్ను వీడియో గ్రఫీ ద్వారా రికార్డ్ చేస్తున్నారు అధికారులు. విచారణలో భాగంగా అధికారులు పలు కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ‘సుప్రీం, పెద్దాయన’ ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ ఈ కేసులో కీలక నిందితులు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని సిట్ అధికారులు కేసీఆర్ ముందు ప్రస్తావించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుప్రీం, పెద్దాయన అంటే మీరేనా అని కేసీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది.
►ALSO READ | 48కి 48 గెలవాలి.. సీఎం రేవంత్‌ను అడిగి ఎన్ని నిధులైనా తెస్తా: మంత్రి కోమటిరెడ్డి
రిటైర్డ్ అయిన అధికారులను ఎందుకు పదవుల్లో కొనసాగించారు.. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధకిషన్ రావుతో మీరెప్పుడైనా మాట్లాడారా.. ఒకవేళ మాట్లాడితే ఏ అంశాలపై మాట్లాడారు.. ఫోన్ ట్యాపింగ్ డేటాను మీకు ఎవరూ అందజేశారు వంటి అంశాలపై సిట్ అధికారులు కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించిన వీడియోలు మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించినట్లు తెలిసింది.
