హైదరాబాద్: నాచారంలో బీఆర్ఎస్, బీజేపీ లీడర్ల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ నేతపై బూతులు తిడుతూ బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త ప్రవర్తించాడు. నాచారంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త సాయిజెన్ శేఖర్ బీజేపీ లీడర్ గోపాల్ గౌడ్పై దౌర్జన్యం చేశాడు. నాచారం రైతు బజారులోని పబ్లిక్ బోర్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ముందుగా తనపై దాడి చేశాడని సాయిజెన్ శేఖర్ ఆరోపించారు. నాచారం పోలీస్ స్టేషన్లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇద్దరి మద్దతుదారులు రోడ్డెక్కి బాహాబాహీకి దిగడంతో నాచారంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి గొడవను సద్దుమణిగేలా చేశారు.
