హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) సంజయ్కుమార్శ్రీవాస్తవ తనిఖీలు నిర్వహించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా చేపట్టిన పునరాభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. క్రూ లాబీ, కంబైన్డ్ క్రూ రన్నింగ్ రూమ్ తనిఖీలో రన్నింగ్ సిబ్బందికి అందిస్తున్న సౌకర్యాలు, వసతులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్ నియోజకవర్గ శాసన సభ్యుడు పాయల్ శంకర్ జీఎంను కలిసి తన నియోజకవర్గంలోని రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్– కిన్వాట్ సెక్షన్ మధ్య లెవెల్ క్రాసింగ్ గేట్ నంబర్ –-23ను తనిఖీ చేసి గేట్ బూమ్ పనితీరు, రికార్డులు, భద్రతా పరికరాలను జీఎం పరిశీలించారు.
స్టేషన్‌లో ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలు, వసతుల వివరాలను ఆయన ఆరా తీశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కిన్వాట్ స్టేషన్‌లో చేపట్టిన పునరాభివృద్ధి పనులను కూడా పరిశీలించారు. నగాడ - నల్లా వద్ద ఉన్న వంతెనను పరిశీలించిన జీఎం భద్రతకు సంబంధించిన అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.తరువాత, బోకర్ అండ్ముద్ఖేడ్ అమృత్ భారత్ స్టేషన్ల పునరాభివృద్ధి పురోగతిని కూడా ఆయన పరిశీలించారు.
