రైల్వే ‘పింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఇక నుంచి బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రైల్వే ‘పింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఇక నుంచి బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • దీని స్థానంలో ప్రతి జోన్, ప్రొడక్షన్ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం సపరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బడ్జెట్ డాక్యుమెంట్స్ విడుదల
  • ఇందులో రెవెన్యూ, ఖర్చులు, మూల ధన ఖర్చుల వివరాలు

న్యూఢిల్లీ:  రైల్వే మినిస్ట్రీ ఒక పెద్ద పాలసీని అమల్లోకి తెచ్చింది.  ఇప్పటివరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే "పింక్ బుక్" పబ్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ యాన్యువల్ బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వివిధ జోనల్ రైల్వేలు, ప్రొడక్షన్ యూనిట్లకు బడ్జెట్ కేటాయింపుల వివరాలు ఉంటాయి.  యూనియన్ బడ్జెట్ తర్వాత రిలీజ్ అయ్యే  ఈ పింక్ బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రైల్వే జోన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఫండ్ కేటాయింపుల వివరాలు,   సేఫ్టీ వర్క్స్, మెయింటెనెన్స్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, లైన్ డబ్లింగ్, కొత్త ప్రాజెక్ట్స్ ఖర్చుల వివరాలు ఉంటాయి. దశాబ్దాలుగా  పింక్ బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రైల్వే మినిస్ట్రీ విడుదల చేస్తోంది.  

ఈ ఏడాది నుంచి ప్రభుత్వం  ప్రతి జోన్, ప్రొడక్షన్ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం సపరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పూర్తిస్తాయి బడ్జెట్ డాక్యుమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ఇష్యూ చేయాలని నిర్ణయించింది.  "ప్రతి జోనల్ రైల్వే, ప్రొడక్షన్ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఈ డాక్యుమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెవెన్యూ, వర్కింగ్ ఖర్చులు, క్యాపిటల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెండిచర్, ఇతర పనులు వంటి వివరాలు ఉంటాయి. 

ఈ డాక్యుమెంట్స్ తయారీ పని ఇప్పటికే స్టార్ట్ అయ్యింది" అని రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెప్పారు. లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభలో   ‘‘పింక్ బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎందుకు నిలిపివేశారు, దాన్ని మళ్లీ స్టార్ట్ చేసే ప్లాన్ ఉందా?’’ అని  ఎంపీ దీపక్ దేవ్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా వైష్ణవ్ ఈ విషయం చెప్పారు.