హైదరాబాద్ లో చిరుజల్లులు

హైదరాబాద్ లో చిరుజల్లులు

హైదరాబాద్: తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఆదివారం హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. షేక్‌పేట, మణికొండ, గోల్కొండ, ఫిలిమ్‌నగర్, బంజరాహిల్స్, శేర్‌లింగంపల్లి, చందానగర్ లాంటి ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో మాన్సూన్ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి మ్యాన్‌హోల్స్ ద్వారా నీటిని పంపేందుకు చర్యలు చేపట్టారు. మరో రెండ్రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.