నా మాజీ భార్యకు చాలా మందితో సంబంధాలు.. శ్వేతా తివారిపై రాజా చౌదరి షాకింగ్ కామెంట్స్!

నా మాజీ భార్యకు చాలా మందితో సంబంధాలు.. శ్వేతా తివారిపై రాజా చౌదరి షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్, టెలివిజన్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ప్రేమజంటగా గుర్తింపు పొందిన శ్వేతా తివారి – రాజా చౌదరి వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. ఇప్పటికే ఎన్నో వివాదాలు, కోర్టు కేసులు, పరస్పర ఆరోపణలతో వార్తల్లో నిలిచిన ఈ మాజీ దంపతుల కథ మరోసారి వార్తల్లోకి వచ్చింది.. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో రాజా చౌదరి , మాజీ భార్య శ్వేతా తివారి వ్యక్తిగతం జీవితంపై సంచలన ఆరోపణలు చేశారు . ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

నటుడు సెజాన్ ఖాన్‌తో శ్వేతాకి సన్నిహిత సంబంధం ఉందని తాను అప్పట్లో నమ్మడానికి కారణాలున్నాయని చెప్పాడు రాజా చౌదరి. తమకు తెలిసిన ఓ స్నేహితుడు కూడా శ్వేతా తరచూ సెజాన్ ఇంటికి వెళ్లేదని చెప్పాడని ఆరోపించాడు. అంతేకాదు సెజాన్ మాత్రమే కాదు. ఆమె చాలా మందితో సంబంధాలు పెట్టుకుంది అనిపించింది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

అయితే వెంటనే యాంకర్ జోక్యం చేసుకుని, కేవలం వ్యక్తిగత అభిప్రాయం ఆధారంగా ఇలాంటి ఆరోపణలు చేయడం సరైంది కాదని సూచించాడు. దీనికి స్పందించిన రాజా, తాను చూసిన సంఘటనలు, తనకు తెలిసిన వివరాల వల్లే ఆ అనుమానాలు వచ్చాయని చెప్పాడు. షూటింగ్‌కు వెళ్తున్నానని చెప్పి వేరే చోటికి వెళ్లేదని, కొన్ని సందర్భాల్లో తానే వెళ్లి చూసినట్లు కూడా ఆరోపించాడు.  ఒకసారి సెజాన్‌ను నేరుగా ప్రశ్నించగా.. ఆమె నీతో ఉండదు. నువ్వు ఆమెకు జీతం లేని పనివాడివి అని అతడు చెప్పాడని రాజా పేర్కొన్నాడు.   

శ్వేతా తివారి, రాజా చౌదరి 1998లో వివాహం చేసుకున్నారు. వారికి 2000లో కుమార్తె పలక్ తివారికి జన్మనిచ్చారు. అనంతరం కుటుంబ కలహాలు తీవ్రరూపం దాల్చడంతో, రాజాపై గృహహింస, మద్యపానం, వేధింపుల ఆరోపణలు చేస్తూ  శ్వేతా బహిరంగంగా మాట్లాడింది. ఇద్దరూ 2007 నుంచి విడిగా ఉండగా, 2012లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

అనంతరం శ్వేతా నటుడు అభినవ్ కోహ్లీని వివాహం చేసుకుంది. ఆ బంధం కూడా నిలవలేదు. ప్రస్తుతం రాజా చేసిన లేటెస్ట్ ఆరోపణలు సోషల్ మీడియాలో మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే శ్వేతా తివారి మాత్రం సెజాన్ ఖాన్‌తో సంబంధం ఉన్నట్లు వచ్చిన ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు.