
గరుడవేగ, కల్కి తర్వాత రాజశేఖర్ నటించిన మరో డిఫరెంట్ చిత్రం ‘శేఖర్’. జీవిత దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ బొగ్గరం, శివాని, శివాత్మిక నిర్మించారు. ఈ రోజు సినిమా విడుదలవుతున్న సందర్భంగా రాజశేఖర్ ఇలా ముచ్చటించారు.
‘‘కొవిడ్ టైమ్‌లో బాగా ఇబ్బంది పడ్డాను. కోలుకోవడం కష్టమే అనుకున్నాను. జీవిత, పిల్లలిద్దరూ నన్ను ప్రాణంగా చూసుకున్నారు. అందుకే బయటపడి పాత స్టేజ్‌కి వచ్చాను. ఎనర్జీ లెవెల్స్ ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాలో నటించాను. ఓ డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘జోసెఫ్’కి ఇది రీమేక్. ఆ మూవీ సోల్ మిస్సవకుండా చాలా బాగా తీసింది జీవిత. తనో వండర్ఫుల్ డైరెక్టర్. అయితే మలయాళంలో కాస్త స్లోగా ఉంటుంది కనుక మేం ఇంకాస్త బెటర్‌గా చేశాం. నాకు రీమేక్ సినిమాలు మంచి సక్సెస్ ఇచ్చాయి. ఇప్పటికే కొన్ని మలయాళ సినిమాలు రీమేక్ చేసి హిట్స్ అందుకున్నాను. ఇది కూడా ఎవర్నీ డిజప్పాయింట్ చేయదు. నేను కూడా ఆర్టిస్టుగా చాలా సంతృప్తి చెందాను. మిడిల్ ఏజ్ క్యారెక్టర్ కాబట్టి కొత్తగా కనిపిస్తే బాగుంటుంది అని డిఫరెంట్ లుక్ ట్రై చేశాం. రియాల్టీకి దగ్గరగా ఉంటుందని శివానిని నా కూతురిగా పెట్టాం. ఇక సాయికుమార్ నాకు ఇరవై ఏడేళ్లు డబ్బింగ్ చెప్పారు. పదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ‘గరుడవేగ’కి చెప్పారు. ఈ సినిమాలో కూడా ఆయనే చెప్పారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం. ఈ మూవీ సక్సెస్ అయితేనే అప్పుల నుంచి బయటపడతాం. లేదంటే ఇబ్బందులు తప్పవు. అందుకే టెన్షన్‌గా ఉన్నాను. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌పై కూడా దృష్టి పెడుతున్నాం. ‘దొరసాని’ ఫేమ్ మహేంద్ర, ప్రవీణ్ సత్తారు మా నలుగురితో సినిమా తీయడానికి స్ర్కిప్ట్ రెడీ చేస్తామన్నారు. త్వరలోనే ఒక ప్యాన్ ఇండియా సినిమా కూడా అనౌన్స్ చేస్తాం.’’