అలా జరగాల్సిన పెళ్లి..ఇలా పీపీఈ కిట్లు ధరించి

అలా జరగాల్సిన పెళ్లి..ఇలా పీపీఈ కిట్లు ధరించి

మాయదారి కరోనా పెళ్లి కూడా సంతోషంగా చేసుకోనివ్వడంలేదు. ఆకాశం అంత పందిరి..భూదేవంత అరుగమీద ఒక్కటి కావాల్సిన దంపతులు పీపీఈ కిట్లు ధరించి కరోనా కేర్ సెంటర్లలో వరుడు వధువు మెడలో తాళికట్టి తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు.
రాజస్థాన్ లోని షాహనాబాద్ జిల్లాలో పెళ్లి జరిగింది. పెళ్లంటే పైన మనం చెప్పుకున్నట్లు ఆకాశం అంత పందరిలో కాదు… కరోనా కేర్ సెంటర్లలో పీపీఈ కిట్లు ధరించి వరుడు వధువులిద్దరూ ఒక్కటయ్యాయి. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పెళ్లికూతురికి కరోనా సోకింది. కానీ తన పెళ్లి జరగాల్సిందేనని పట్టుబట్టింది.  అందులో పెళ్లికూతురు తప్పు లేదులేండి. మధ్యతరగతి కుటుంబంలో ఆడపిల్ల పెళ్లి చేయడం ఎంతకష్టమో మనకు తెలియంది కాదు.

ఇక అసలు విషయానికొస్తే కరోనా వచ్చినా అనుకున్న సమయానికి పెళ్లి జరగాల్సిందేనని పెళ్లికూతురి రిక్వెస్ట్ తో పెళ్లికొడుకు పీపీఈ కిట్లు ధరించి పెళ్లికి అంగీకరించాడు. కరోనా పీపీఈ కిట్లనే కోట్లుగా ధరించిన పురోహితుడు, అతని అసిస్టెంట్ కూడా మంత్రాలు చదువుతూ ఈ వివాహాన్ని ఘనంగా జరిపారు. వివాహం అనంతరం పెళ్లి కూతుర్ని కరోనా కేర్ సెంటర్ లో క్వారంటైన్ లోకి పంపారు.