Kalki 2898 AD: కల్కి సినిమాకు కష్టకాలమే.. కంగారుపడుతున్న ఫ్యాన్స్

Kalki 2898 AD: కల్కి సినిమాకు కష్టకాలమే.. కంగారుపడుతున్న ఫ్యాన్స్

పాన్ ఇండియా స్టార్  ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD). క్రియేటీవ్ దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అశ్విని దత్ తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశం తో హాలీవుడ్ రేంజ్ లో   వస్తున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ ఆంచనాలను మరింత పెంచేసింది. 

ముందుగా ఈ సినిమాను మే 9న థియేటర్స్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ, ఎలెక్షన్స్ కారణంగా జూన్ 27కు పోస్ట్ పోన్ చేస్తూ అప్డేట్ ఇచ్చారు. అయితే ఈ కొత్త రిలీజ్ డేట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త కంగారుపడుతున్నారు. మాములుగా కల్కి లాంటి భారీ సినిమాళుళ్ లాంగ్ వీకెండ్ సెట్ అయ్యేలా రిలీజ్ ప్లాన్ చేస్తారు. ఎందుకంటే.. బడ్జెట్ ఎక్కువ కాబట్టి రికవరీ ఈజీగా అవుతుందని అలా చేస్తారు. కానీ, కల్కి రిలీజ్ విషయంలో మేకర్స్ అలాంటి ప్లాన్ చేయడం లేదు. 

మాములు రిలీజ్ లాగే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. జూన్ 27 అంటే గురువారం సినిమా రిలీజ్ అవుతుండగా.. తరువాత వీకెండ్ తప్పా ఎలాంటి స్పెషల్ హాలీడేస్ ఏమీ లేవు. కాబట్టి వర్కింగ్ డేస్ లోనే ఆడియన్స్ థియేటర్స్ కి రావల్సి ఉంటుంది. సినిమాకు ఒక రేంజ్ లో హిట్ టాక్ వస్తే తప్పా.. వర్కింగ్ డేస్ లో థియేటర్స్ కి వచ్చే అవకాశం తక్కువ. అందుకే కల్కి సినిమాకు కష్టకాలమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి రిలీజ్ తరువాత కల్కి సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.