V6 News

కాంగ్రెస్‌లో గొడవల వల్ల.. రాజస్థాన్‌ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు: వసుంధర రాజే

కాంగ్రెస్‌లో గొడవల వల్ల.. రాజస్థాన్‌ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు: వసుంధర రాజే
  • రాజస్థాన్‌ రాజకీయంపై స్పందించిన రాష్ట్ర మాజీ సీఎం

జైపూర్‌‌: రాజస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభంపై రాష్ట్ర మాజీ సీఎం వసుంధరా రాజే స్పందించారు. కాంగ్రెస్‌లో నెలకొన్న గొడవలకు ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై శనివారం ఆమె ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న అంతర్గత విషయాల వల్ల గొడవలు తలెత్తాయని బీజేపీని మధ్యలోకి లాగడం అస్సలు కరెక్టు కాదని ఆమె అన్నారు. రాజస్థాన్‌ ప్రజలే ముఖ్యం అనే విషయం గుర్తు పెట్టుకోవాలని ఆమె సూచించారు. “ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రజలు జీవితాల కోల్పోతున్నారు. మిడతల దండు రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్‌ పెరిగిపోయింది. ప్రజలు పడుతున్న కొన్ని ప్రాబ్లమ్స్‌ను మాత్రమే ఇక్కడ చెప్పగలుగుతున్నాను. అలాంటిది కాంగ్రెస్‌ ఇలా చేయడం దురదృష్టకరం. వాళ్ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంలో బీజేపీని ఇబ్బందులకు గురిచేయడం కరెక్ట్‌ కాదు” అని వసుంధర రాజే ట్వీట్‌ చేశారు. రాజస్థాన్‌లో గత కొద్ది రోజులుగా రాజకీయ సంక్షోభం నెలకొన్ని విషయం తెలిసిందే.