రాజీవ్‌ కనకాల సోదరి మృతి

రాజీవ్‌ కనకాల సోదరి మృతి

న‌టి శ్రీలక్మి కనకాల మృతి చెందారు. శ్రీల‌క్ష్మీ నటుడు రాజీవ్‌ కనకాలకు సోదరి. కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె.. సోమవారం ఓ ‍ప్రైవేటు హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతూ చ‌నిపోయింది. శ్రీల‌క్ష్మి మృతితో రాజీవ్‌ కనకాల, సుమ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆమె భర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ పెద్ది రామారావు కాగా ..ఆమె తండ్రి ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాసు కనకాలకు శ్రీలక్ష్మీ ఏకైక కుమార్తె. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. శ్రీల‌క్ష్మీ పలు టీవీ సీరియల్స్‌లో నటింటి మంచి నటిగా గుర్తింపుపొందారు.