V6 News

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాక్షసపురం

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాక్షసపురం

రాజ్ బి శెట్టి హీరోగా డాక్టర్ రవి దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం ‘రాక్షసపుర’.  అక్కడ  సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ  చిత్రాన్ని  నిర్మాత  కేఎస్ రామారావు ‘రాక్షసపురం’ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మే 1న  తెలుగులో విడుదల చేస్తున్నారు.  ఈ సందర్భంగా కేఎస్ రామారావు మాట్లాడుతూ ‘ఇదొక  మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. కన్నడ వెర్షన్ చూసిన తర్వాత  సినిమాలోని మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, సస్పెన్స్ ఎలిమెంట్స్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే తెలుగు ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నా. 

సినిమాలో రాజ్ బి శెట్టి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ పాత్రలో అద్భుతంగా నటించారు.  త్వరలోనే తెలుగు ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేస్తాం’ అని అన్నారు.  ప్రస్తుతం ఐపీఎల్ సందడి ఎక్కువగా ఉన్నందున, వీలైనంత వరకు మార్నింగ్, మ్యాట్నీ షోలకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాను ప్రదర్శించాలని డిస్ట్రిబ్యూటర్లను కోరారు. నిర్మాత తుమ్మల రామసత్యనారాయణ పాల్గొని, కేఎస్ రామారావు లాంటి అభిరుచి గల నిర్మాత నుంచి వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరారు.