లాభాల కోసం కాదు.. చేనేత కార్మికులకు సాయం చేయడానికే

లాభాల కోసం కాదు..  చేనేత కార్మికులకు సాయం చేయడానికే
  • ‘వెలుగు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంపెనీ చైర్మన్‌ నాగరాజన్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: దోతి అంటే గుర్తొచ్చేది రామ్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌ కాటనే.. ప్రస్తుతం ఈ కంపెనీ  మహిళల కోసం చీరలు, కుర్తాలను కూడా తీసుకొస్తోంది. ఇప్పటికే పంచలు, కాటన్ చొక్కాలు, పిల్లల కోసం సపరేట్‌‌‌‌‌‌‌‌గా క్లాత్స్‌‌‌‌‌‌‌‌ను తెస్తున్న రామ్‌‌‌‌‌‌‌‌రాజ్ గ్రూప్ , ఈ మధ్య కాలంలోనే మెన్‌‌‌‌‌‌‌‌, వుమెన్‌‌‌‌‌‌‌‌ ఇన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్  బిజినెస్‌‌‌‌‌‌‌‌లలోకి కూడా ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యింది. కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్, ఇతర విషయాలను రామ్‌‌‌‌‌‌‌‌రాజ్ గ్రూప్ ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాగరాజన్‌‌‌‌‌‌‌‌ ‘వీ6 వెలుగు’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 

నార్త్‌‌‌‌‌‌‌‌లో కూడా విస్తరిస్తం..

వివిధ రకాల షాపింగ్ మాల్స్‌‌‌‌‌‌‌‌, క్లాత్‌‌‌‌‌‌‌‌ స్టోర్లతో పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ కుదుర్చుకున్న కంపెనీ,  సొంత స్టోర్లను కూడా ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. తమ ప్రధాన వ్యాపారం రామ్‌‌‌‌‌‌‌‌రాజ్ కాటన్‌‌‌‌‌‌‌‌ దుస్తులను, దోతిలను 10,000 కు పైగా పార్టనర్లకు సప్లయ్ చేయడమేనని, సొంత బ్రాండ్‌‌‌‌‌‌‌‌ను మరింత విస్తరించడానికి స్టోర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని నాగరాజన్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ప్రస్తుతం మొత్తం 220 స్టోర్లను ఆపరేట్ చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా తమిళనాడు, తెలంగాణ,  కేరళ,  కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాలలో  రామ్‌‌‌‌‌‌‌‌రాజ్ కాటన్‌‌‌‌‌‌‌‌ విస్తరించింది.

నార్త్‌‌‌‌‌‌‌‌ ఇండియా రాష్ట్రాల్లో కూడా ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతామని నాగరాజన్ అన్నారు.  అక్కడి లోకల్‌‌‌‌‌‌‌‌ దుస్తులు, కల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టు క్లాత్స్‌‌‌‌‌‌‌‌ను తయారు చేస్తామని చెప్పారు.  లాభాల కోసం కంపెనీని ఏర్పాటు చేయలేదని చెబుతున్న ఆయన, కరోనా టైమ్‌‌‌‌‌‌‌‌లో కూడా చేనేత కార్మికులకు మద్ధతుగా నిలిచామని అన్నారు. తిరుపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సేలం,  కొయంబత్తూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ధర్మపురి వంటి సిటీలలోని చేనేత కార్మికులకు పని ఇస్తున్నామని అన్నారు. మొత్తం 50 వేలకు పైగా చేనేత కార్మికులు తమపై ఆధారపడి బతుకుతున్నారని చెప్పారు.

తాము కేవలం చేనేత కార్మికుల ద్వారానే దుస్తులను తయారు చేస్తున్నామని, మెషినరీ వాడడం లేదని నాగరాజన్ వివరించారు. దేశంలో దోతిలు  వాడే వారు 1 శాతం కూడా లేరని, కానీ, లాభాల కోసం పెట్టిన కంపెనీ కాదు కాబట్టి కొనసాగుతున్నామని అన్నారు. కరోనా టైమ్‌‌‌‌‌‌‌‌లో లోన్లను తీసుకొని మరీ తమపై ఆధారపడిన చేనేత కార్మికులకు  పని కలిపించామని చెప్పారు. డిమాండ్ లేనప్పుడు కూడా ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ కొనసాగిస్తామని, పీక్ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఈ దుస్తులను సప్లయ్ చేస్తామని  వివరించారు.