V6 News

డీలిమిటేషన్‌‌‌‌పై చర్చకు సీఎం సిద్ధమా? : రాంచందర్ రావు సవాల్

డీలిమిటేషన్‌‌‌‌పై చర్చకు సీఎం సిద్ధమా? : రాంచందర్ రావు సవాల్
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సవాల్​
  • కులగణన సర్వే తప్పుల తడకలా ఉందని విమర్శ

హైదరాబాద్, వెలుగు: డీలిమిటేషన్​తో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారంపై చర్చకు తాను సిద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు అన్నారు. ముఖ్యమంత్రి డేట్, టైమ్ చెబితే అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్దకు వస్తానని, తేల్చుకుందామని సవాల్ విసిరారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ.సుభాష్ తో కలిసి మీడియాతో చిట్ చాట్ చేశారు. దేశాన్ని నార్త్, సౌత్ పేరిట విభజించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు.

డీలిమిటేషన్​తో దక్షిణాదికి ఎలాంటి నష్టం జరగదన్నారు. 70 కోట్ల జనాభా ఉన్నప్పుడు 543 సీట్లు ఉంటే.. ఇప్పుడు 140 కోట్ల జనాభాకు అనుగుణంగా సీట్లు పెంచాల్సిన అవసరం ఉందా.. లేదా? అనేది సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలం గాణలో ఏటా రూ.40 వేల కోట్లు మద్యం అమ్మకాలతో వస్తుందని, దీన్ని చూపించి సీట్లు పెంచాలనడం ఏంటని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ మోదీకి దక్కుతుందనే భయంతోనే కాంగ్రెస్ అడ్డుపడుతోందని ఆరోపించారు.

1996లో దేవెగౌడ హయాంలో జనాభా ప్రాతిపదికన బిల్లు తెస్తే ఎవరూ సపోర్ట్ చేయలేదని, ఇప్పుడు మోదీ తెస్తే.. రాహుల్ గాంధీ ఓబీసీ కోటా పేరుతో కొత్త మెలిక పెడుతున్నా రని పేర్కొన్నారు. ముస్లింలకు, ఎంఐఎంకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే ఎక్కడ, ఎలా చేసిందో ఎవరికీ తెలియదని విమర్శించారు. ఎన్యూమరేటర్లు తమ గల్లీకి రాలేదని, డేటా తీసుకోకుండానే రిపోర్టు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సర్కారు రిలీజ్ చేసిన డేటా అంతా తప్పుల తడకగా ఉందన్నారు.

తెలంగాణను పాకిస్తాన్‌‌‌‌తో పోల్చలేదు

ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తన రాజకీయ లాభం కోసం కావాలనే వక్రీకరిస్తోందని రాంచందర్ రావు మండిపడ్డారు. తెలంగాణను ఆయన పాకిస్తాన్‌‌‌‌తో పోల్చలేదని, కేవలం భారత విభజన సమయంలో కాంగ్రెస్​ చేసిన జాప్యం వల్ల జరిగిన ప్రాణనష్టాన్ని ఒక ఉదాహరణగా మాత్రమే ప్రస్తావించారని తెలిపారు.

ఆయన వ్యాఖ్యలను అర్థం చేసుకోకుండా తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషిం చిందని, పార్లమెంట్​లో సుష్మా స్వరాజ్, రాజ్‌‌‌‌నాథ్ సింగ్ వంటి నేతలు బలంగా మద్దతు తెలపడం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. తెలంగాణ ఉద్య మం రక్తపాతం, బలిదానాలతో నిండి పోవడానికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు.