- హైకోర్టుకు నివేదించిన రాంకీ ఫార్మా
హైదరాబాద్, వెలుగు: విశాఖపట్టణంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం అప్పటి ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ టెండర్ ప్రక్రియ ద్వారానే ప్రాజెక్టును దక్కించుకున్నామని హైకో ర్డుకు రాంకీ ఫార్మా లిమిటెడ్ తెలిపింది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి తమ ఆస్తులను జప్తు చేసిందని రాంకీ ఫార్మా వెల్లడించింది. ఈ జప్తు చే ల్లదంటూ అప్పీలెట్ ట్రైబ్యునల్ తీర్పు వెలువరించగా దాన్ని సవాల్ చేస్తూ ఈడీతోపాటు రాంకీ ఫార్మా(ట్రైబ్యునల్ తీర్పును పూర్తిగా అమలు చేయాలని) కూడా హైకోర్టులో అప్పీ ళ్లు దాఖలు చేశాయి.
వీటిపై జస్టిస్ పి.శ్యాంకోశీ, జస్టిస్ నందికొండ నర్సింగ్గావులతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. దీని పైరాంకీ తరఫు న్యాయవాది వాదిస్తూ..విశాఖపట్టణంలో ఫార్మ సిటీ ఏర్పాటు నిమిత్తం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలవగా ప్రాజెక్టును దక్కించుకున్నామన్నారు.
