ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ జంట 

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ జంట 

బాలీవుడ్ లవ్ కపుల్ రణ్బీర్ కపూర్ – ఆలియా భట్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు. బాంద్రాలోని రణ్ బీర్ కపూర్ నివాసం వాస్తులో పెళ్లి తంతు జరిగింది. వీరి వివాహానికి నీతూ కపూర్, రిద్ధిమా కపూర్ సాహ్ని, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, మహేష్ భట్, సోనీ రజ్దాన్, షాహీన్ భట్, కరణ్ జోహార్ తదితరులు అటెండ్ అయ్యారు. వాస్తు ఆపార్ట్ మెంట్లో ఆలియాకు కూడా ఫ్లాట్ ఉంది.  రణ్బీర్ ఆలియా పెళ్లి నేపథ్యంలో ఏప్రిల్ 12 న అపార్ట్ మెంట్ను లైట్లతో అలంకరించారు. 2018 నుంచి ఆలియా భట్, రణ్బీర్ కపూర్లు ప్రేమలో ఉన్నారు. 

రణ్ బీర్ కపూర్, ఆలియా భట్లు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కోసం రెండు రిసెప్షన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 16,17 తేదీల్లో అట్టహాసంగా జరగనున్న రిసెప్షన్ పార్టీలకు బాలీవుడ్ సెలబ్రిటీలైన షారూఖ్ ఖాన్, రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె, సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రా, అర్జున్ కపూర్, కరణ్ జోహార్ తదితరులు హాజరుకానున్నట్లు సమాచారం.