V6 News

రణబీర్ కపూర్ కు అరుదైన గౌరవం...2026 'టైమ్' మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ వ్యక్తుల జాబితాలో చోటు!

రణబీర్ కపూర్ కు అరుదైన గౌరవం...2026 'టైమ్' మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ వ్యక్తుల జాబితాలో చోటు!

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ కపూర్ కు అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.  ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితాను టైమ్ వెల్లడించింది. 2026 సంవత్సరానికి గాను 'టైమ్ 100' లో  రణవీర్ కపూర్ కు చోటు దక్కింది. ఈ ఏడాది ఈ జాబితాలో నిలిచిన ఏకైక భారతీయ నటుడు రణవీర్ కావడం విశేషం. ఆయన తో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ప్రఖ్యాత చెఫ్ వికాస్ ఖన్నా, యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ వంటి ప్రముఖులు భారతీయ ప్రతినిధులుగా ఈ గౌరవాన్ని అందుకున్నారు.

రణబీర్ ఒక వారసత్వం!

ఈ సంర్భంగా గతంలో (2020లో) టైమ్ 100 జాబితాలో నిలిచిన నటుడు ఆయుష్మాన్ ఖురానా.. రణబీర్ కపూర్ అభినందించారు. కొందరు నటులు వారసత్వం కోసం ప్రాకులాడుతుంటారు, మరికొందరు తమ నటనతోనే ఒక వారసత్వంగా మారుతారు. రణబీర్ రెండో రకానికి చెందిన నటుడు అని ఆయుష్మాన్ ప్రశంసించారు. భారతీయ సినిమా అంటే కేవలం బాక్సాఫీస్ లెక్కలు, విజిల్స్ మాత్రమే కాదు, భావోద్వేగాలను నిశ్శబ్దంగా పండించడంలో రణబీర్ శైలి విభిన్నమైనదని ఆయన కొనియాడారు.

ALSO READ : ఎన్టీఆర్ 'డ్రాగన్' లోకి బాలీవుడ్ బ్యూటీ..

 ముఖ్యంగా అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతిని, పురాణాలను ప్రతిబింబించే కథకుడిగా రణబీర్ ఎదుగుతున్న తీరు అమోఘమని ఆయుష్మాన్ ఖురానా పేర్కొన్నారు. అటు రణబీర్ సాధించిన ఈ విజయంపై ఆయన భార్య, నటి ఆలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. "లుకింగ్ గుడ్ బేబీ" అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

 

భారీ బడ్జెట్ తో 'రామాయణం'..

రణబీర్ ఈ స్థాయి గుర్తింపు పొందడానికి ప్రధాన కారణం నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత భారీ చిత్రం 'రామాయణం'.  దాదాపు రూ.4 వేల కోట్లతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా ఇది తెరకెక్కుతోంది. తొలిసారిగా భారతీయ దిగ్గజం ఏఆర్ రెహమాన్ , ఆస్కార్ విజేత హన్స్ జిమ్మర్ కలిసి ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ఈ  మూవీలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం అక్టోబర్ 2026లో దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, రెండో భాగం 2027 దీపావళికి రానుంది.

ALSO READ : ప్రభాస్ ‘స్పిరిట్’ సెన్సేషన్..

ప్రపంచాన్ని గెలిచిన వికాస్ ఖన్నా..

రణబీర్‌తో పాటు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మరో భారతీయుడు సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా. ఆహారాన్ని ఒక విశ్వజనీన భాషగా మార్చి, మనుషుల మధ్య వంతెనలు నిర్మించడంలో ఆయన కృషి అమోగమైనదని  టైమ్ పేర్కొంది.  . న్యూయార్క్‌లోని తన 'బంగ్లా' రెస్టారెంట్ ద్వారా భారతీయ వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఆయనకు ఈ గౌరవం దక్కింది.

 రాల్ఫ్ లారెన్, విక్టోరియా బెక్హాం వంటి దిగ్గజాల సరసన వికాస్ నిలవడం భారతీయ పాకశాస్త్ర ప్రతిభకు దక్కిన గౌరవం. మొత్తానికి, 2026 టైమ్ జాబితాలో రణబీర్ కపూర్ చోటు సంపాదించడం అనేది భారతీయ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు, సాంస్కృతిక వేదికపై కూడా అగ్రస్థానానికి చేరుకుందని నిరూపిస్తోంది.