రేప్‌‌లను నియంత్రించాలంటే సంస్కారం తప్పనిసరి

రేప్‌‌లను నియంత్రించాలంటే సంస్కారం తప్పనిసరి

న్యూఢిల్లీ: హత్రాస్, బల్‌‌రాంపూర్ గ్యాంగ్ రేప్ ఘటనలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీటిపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దేశంలో అత్యాచారాలను తగ్గించాలంటే సంస్కారంతోనే సాధ్యమని.. అధికారం, కత్తితో కాదని సురేంద్ర అన్నారు. తల్లిదండ్రులు తమ కూతుళ్లకు సంస్కారం, విలువలు నేర్పించాలన్నారు. ఆడబిడ్డలను రక్షించడం ప్రభుత్వ ధర్మమని, అదే టైమ్‌‌లో తమ కూతుళ్లకు సంస్కారం నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని పేర్కొన్నారు.