V6 News

దేశంలోనే సంచలనం ఈ కాజల్ మీనా: రూ.60 వేల లంచంతో అరెస్ట్: IIT చదువు.. పోటీ పరీక్షల్లో నెంబర్ వన్..

దేశంలోనే సంచలనం ఈ కాజల్ మీనా: రూ.60 వేల లంచంతో అరెస్ట్: IIT చదువు.. పోటీ పరీక్షల్లో నెంబర్ వన్..

కొన్ని కొన్ని జీవితాలు చూస్తుంటే అయ్యో పాపం అనుకుంటాం.. ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు.. ఇంతలోనే ఇలా జరిగిందా అనిపిస్తుంది.. అలాంటి కేసే ఇది.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న కాజల్ మీనా అరెస్ట్ వ్యవహారం.. హాట్ టాపిక్ అయ్యింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిని.. అవినీతి కేసులో అరెస్ట్ అయితే ఎందుకు ఇంత చర్చ అంటారా.. ఆమె బ్యాగ్రౌండ్.. ఆమె ఎడ్యుకేషన్ హిస్టరీ.. ఆమె తెలివితేటలు.. ఇప్పుడు ఇవే హల్ చల్ చేస్తున్నాయి.

ఎవరీ కాజల్ మీనా.. ఎందుకు అరెస్ట్ :

రాజస్థాన్ రాష్ట్రంలో సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ (SDM)గా పని చేస్తున్నారు కాజల్ మీనా. 2024లో జరిగిన రాజస్థాన్ రాష్ట్ర పోటీ పరీక్షల్లో స్టేట్ టాపర్‎గా నిలిచారు. దీంతో ఆమెకు గ్రూప్ 1 స్థాయి ర్యాంక్‎తో.. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్.. అంటే మన దగ్గర RDO.. రెవెన్యూ డివిజిన్ అఫీసర్ క్యాడర్ ఉద్యోగంలో చేరారు.

ఆ తర్వాత ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసుకుని ఆరు నెలల క్రితమే SDM.. మన దగ్గర ఆర్డీవో స్థాయి ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో చేరిన వెంటనే పనిపై కంటే లంచాలపై బాగా దృష్టిపెట్టారు కాజల్ మీనా. ఈ క్రమంలోనే ఆరోపణలు వచ్చాయి. ఇలా జరుగుతున్న క్రమంలో.. ఓ భూమికి సంబంధించిన డిక్రీ జారీ విషయంలో 60 వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు కాజల్ మీనా. ఆ బాధితుడు నేరుగా ఏసీబీకి కంప్లయింట్ చేశాడు. ఏసీబీ వాళ్లు ట్రాప్ చేశారు. ఏసీబీ వాళ్లు అనుకున్నట్లుగానే 60 వేల రూపాయల లంచంతో రెడ్ హ్యాండెడ్‎గా దొరికారు కాజల్ మీనా. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. 

కాజల్ మీనా చదువునే ఇప్పుడు హాట్ టాపిక్ :

లంచంతో దొరికిన కాజల్ మీనా చాలా మెరిట్ స్టూడెంట్. ఆమె కాంపిటిటివ్ ఎగ్జామ్ రాస్తే జాబ్ పక్కా. ఆమె బీటెక్ కూడా సాదాసీదా కాలేజీలో చేయలేదు. హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మక ఐఐటి మండి నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. కాజల్ మీనా గతంలో EPFO, టెలికమ్యూనికేషన్స్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO)గా పనిచేశారు. 2017లో JEN పోస్టుకు ఎంపికయ్యారు. కానీ ఆర్‌ఏఎస్ ఆమె లక్ష్యం కావడంతో ఉద్యోగంలో చేరలేదు. చివరకు 2024లో ఆమె అనుకున్నది సాధించింది. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS) 2024 పరీక్షల్లో టాపర్‎గా నిలిచింది. 

ట్రైనింగ్ కంప్లీటైన తర్వాత నదౌతిలో పోస్టింగ్ పోస్టింగ్ పొందారు. కానీ తొలి పోస్టింగ్‎లోనే లంచం తీసుకుండా అడ్డంగా బుక్ అయ్యారు. ఉన్నత చదువులు చదివి.. అనుకున్న ఉద్యోగం సాధించి.. సమాజంలో అవినీతిని ఎండగడతానని ప్రగల్భాలు పలికి చివరకు ఓ సాధారణ పౌరుడు నుంచి లంచం తీసుకుని ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‎గా కాజల్ మీనా పట్టుబడటం గమనార్హం. అంత డబ్బు పిచ్చి ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో చేరడం ఎందుకని.. ఐఐటీలో బీటెక్ కంప్లీట్ చేసిన ఐటీ కంపెనీలు లక్షల రూపాల జీతాలు ఇచ్చి తీసుకుంటాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

కాజల్ మీనా పాత వీడియో వైరల్: 

లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‎గా చిక్కిన కాజల్ మీనా ఆర్‌ఏఎస్ పరీక్షకు సిద్ధమయ్యే సమయంలో కొన్ని మాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఇప్పుడు అవినీతి కేసులో ఆమె పట్టుబడటంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ప్రతిష్టాత్మక ఐఐటి నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి లక్షల ప్యాకేజీలు ఇచ్చే ఐటీ ఉద్యోగంలో చేరకుండా ఆర్ఎస్ఏ ఉద్యోగంలో ఎందుకు చేరాలనుకుంటున్నారని ఇంటర్వ్యూయర్ అడగగా.. ఆర్‌ఏఎస్ ఒక ప్రతిష్టాత్మకమైన సేవ అని, అక్కడ తాను సమాజంలో గణనీయమైన మార్పు తీసుకువచ్చి ప్రజల జీవితాలను మెరుగుపరచగలనని కాజల్ మీనా సమాధానం చెప్పారు. 

తొలి పోస్టింగ్‏లోనే  లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‎గా పట్టుబడటంతో ఈ వీడియో ఘోరంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు కాజోల్ మీనాపై సెటైర్లు వేస్తున్నారు. పని కోసం వచ్చిన సాధారణ ప్రజల నుంచి వేలకు వేలు లంచం తీసుకోవడమేనా సమాజంలో మీరు తీసుకురావాలనుకున్న గణనీయమైన మార్పు అంటూ ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు.