వీడియో వైరల్: పంజాబీ పాటకు ‘రావణుడి’ భాంగ్రా స్టెప్స్

వీడియో వైరల్: పంజాబీ పాటకు ‘రావణుడి’ భాంగ్రా స్టెప్స్

న్యూఢిల్లీ: రామయణంపై తీసిన సీరియళ్లు, సినిమాలలో సీరియస్‌‌గా కనిపించే రావణుడి పాత్రను చూశాం. కానీ ఇక్కడో రావణుడు పంజాబీ పాటకు భాంగ్రా స్టెప్స్ వేస్తూ ఎంటర్‌‌టైన్ చేశాడు. రావణుడు ఏంటి, డ్యాన్స్ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా? వివరాలు.. ఉత్తరాదిలో విజయదశమి ఉత్సవాల సందర్భంగా రామ్‌‌లీల కార్యక్రమం నిర్వహిస్తుంటారు. అయితే కరో్నా కారణంగా ఈ ఏడాది రామ్‌‌లీల ఉత్సవాలను చాలా చోట్ల రద్దు చేశారు. కొన్ని ప్రాంతాల్లో వర్చువల్ ప్లాట్‌‌ఫామ్‌‌లపై నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌‌లోని ఒక రామ్‌‌లీల కార్యక్రమంలో పంజాబీ పాటకు రావణుడి పాత్రధారి భాంగ్రా స్టెప్పులు వేస్తున్న వీడియో నెటిజన్స్‌‌ను ఆకట్టుకుంటోంది. ఇది ఎప్పుడు జరిగిందనే వివరాలు తెలియరాలేదు. ఈ వీడియోను చూసిన ఓ నెటిజన్.. రావణుడు పంజాబీ సాంగ్‌కు స్టెప్పులు వేశాడంటే 2020 పీక్స్‌‌కు చేరిందంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఇతడు పంజాబీ రావణుడని, దీన్ని లైవ్‌‌గా చూడలేకపోయామంటూ మరికొందరు నెటిజన్స్ కామెంట్లు పెట్టారు. నెట్‌‌లో బాగా వైరల్ అవుతున్న రావణుడి డ్యాన్స్ వీడియోను మీరూ చూసేయండి.