రవిశాస్త్రీకి 120 ఏళ్లా.? గూగుల్ ను ఆటాడుకుంటున్న నెటిజన్లు

రవిశాస్త్రీకి 120 ఏళ్లా.? గూగుల్ ను ఆటాడుకుంటున్న నెటిజన్లు

కంప్యూటర్ యుగంలో టెక్నాలజీ  మీద ఎంతగా ఆధారపడ్డామో అందరికీ తెలుసు. ఏం కావాలన్నా సెర్చ్ ఇంజిన్ లో వెతకడమే పనిగా పెట్టుకుంటాం. సెర్చ్ ఇంజిన్ లో వచ్చిందే నిజమనుకుంటాం..మరి ఒక్కోసారి ఆ సెర్చ్ ఇంజిన్లు కూడా తప్పుడు సమాచారాన్ని చూపెడుతుండటం విశేషం. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ అపుడపుడు తప్పుడు ఇన్ఫర్మేషన్ ను ఇస్తున్నాయి. లేటెస్ట్ గా టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి వయసు గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తే 120 ఏళ్లు అని వస్తుంది. ఇది చూసి అందరు నోరెళ్లబెడుతున్నారు. ఆయన మే, 27, 1900 సంవత్సరంలో పుట్టినట్లు చూపెడుతుంది. రవిశాస్త్రి అసలు వయసు 1962  మే 27. అంటే రవిశాస్త్రికి 59 ఏళ్లు. నమ్మకమైన గూగుల్ ఇలా తప్పుగా చూపెట్టడంతో గూగూల్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.