Ravindra Jadeja: రంజీల్లో సూపర్ ఎంట్రీ ఇచ్చిన జడేజా

Ravindra Jadeja: రంజీల్లో సూపర్ ఎంట్రీ ఇచ్చిన జడేజా

మోకాలి గాయం నుంచి కోలుకుని రంజీల్లో సౌరాష్ట్ర తరుపున పునరాగమనం చేసిన జడేజా బంతితో రాణించాడు. తమిళనాడుతో జరిగిన మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లు పడగొట్టి తమిళనాడును దెబ్బతీశాడు. ఓవరాల్ గా మ్యాచ్ లో ఎనిమిది వికెట్లు తీసి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, బ్యాటింగ్ లో మాత్రం జడ్డూ మెరుపులు కనిపించలేదు. మొదటి ఇన్ని్ంగ్స్ లో 15, రెండో ఇన్నింగ్స్ లో 25 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. 

ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కి ముందు జడ్డూ ఫామ్, ఫిట్ నెస్ ని నిరూపించుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన జడేజా ‘దాదాపు ఆరునెలల తర్వాత గ్రౌండ్ లోకి రావడం ఆనందంగా ఉంది. తొలి ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేస్తుంటే కాస్త కష్టమనిపించింది. ఆట గడుస్తున్న కొద్దీ కుదురుకున్నా. ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్ కి సిద్ధంగా ఉన్నా’ అన్నాడు.