ఉద్రిక్తతలు తగ్గుతాయంటే అభినందన్ ను అప్పగిస్తాం

ఉద్రిక్తతలు తగ్గుతాయంటే అభినందన్ ను అప్పగిస్తాం

భారతదేశంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహముూద్‌ ఖురేషి అన్నారు. అవసరమైతే భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. రెండు దేశాల మధ్య శాంతి, ప్రాంతీయ స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని… యుద్ధం జరిగితే పాక్‌కే నష్టం జరుగుతుందన్నారు. దీంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది కదా అని ప్రశ్నించారు ఖురేషి.

అంతేకాదు ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని భావిస్తే అభినందన్‌ను ఇండియాకు అప్పగిస్తామని కూడా తెలిపారు ఖురేషి. పైలట్‌ అప్పగింత విషయంలో పాజిటివ్‌ దృక్పథంతోనే ముందుకు వెళ్తున్నామన్నారు.