హైదరాబాద్ సిటీలోని లక్షల ఫోన్లకు సైరన్ అలర్ట్.. దీన్ని ఎమర్జెన్సీ అలర్ట్ అని కూడా అంటారు. 2026, మే 2వ తేదీ ఉదయం 11 గంటల 47 నిమిషాలు.. సరిగ్గా ఈ సమయానికి దేశ వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్న సెల్ ఫోన్లలో సైరన్ అలర్ట్ మోగింది. టెలికాం కంపెనీల నుంచి ఒకేసారి.. అన్ని ఫోన్లకు ఈ అలర్ట్ మెసేజ్ వచ్చింది. సిమ్ కార్డు లేని ఫోన్లలో కూడా ఈ సమాచారం రావటం విశేషం.
ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ లో ఏం ఉంది :
భారతదేశం తన స్వదేశీ సాంకేతిక పరిజ్ణానాన్ని ఉపయోగించి.. తమ పౌరుల కోసం తక్షణ విపత్తు నిర్వహణ హెచ్చరిక సేవ గురించి.. సెల్ బ్రాడ్ హెచ్చరిక ప్రారంభించింది. అప్రమత్తం అయిన పౌరులు ఈ సందేశం అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది అప్రమత్తత కోసం ప్రయోగాత్మకంగా చేస్తున్న ప్రక్రియ. ఈ సందేశాన్ని స్వీకరించిన తర్వాత ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పరీక్షా సందేశం.. భారత ప్రభుత్వం అంటూ అన్ని ఫోన్లకు ఈ సమాచారం వచ్చింది.
ఏమిటీ ఈ 'సెల్ బ్రాడ్‌కాస్ట్ టెస్ట్'?
భవిష్యత్తులో భూకంపాలు, సునామీలు లేదా భారీ వర్షాల వంటి ప్రమాదాలు జరిగినప్పుడు, ప్రజలందరినీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం ఈ వ్యవస్థను సిద్ధం చేస్తోంది. అలాగే 2026 మే 2, శనివారం అంటే ఈ రోజున ఉదయం 11:15 నుండి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని, తెలంగాణ ప్రాంతంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఈ పరీక్ష జరుగుతుంది.
మీ ఫోన్‌లో ఏం జరుగుతుంది?
ఈ ట్రయల్ జరుగుతున్నప్పుడు మీ ఫోన్‌కు ఒక మెసేజ్ వస్తుంది. దానితో పాటు పెద్ద శబ్దం రావచ్చు. ఫోన్ గట్టిగా వైబ్రేషన్ అవ్వవచ్చు. స్క్రీన్ మీద హెచ్చరిక మెసేజ్ కనిపిస్తుంది.
గమనిక: ఇది కేవలం ప్రభుత్వం చేస్తున్న పరీక్ష మాత్రమే. నిజమైన ప్రమాదం ఏదీ లేదు. కాబట్టి మీరు ఈ మెసేజ్ చూసి ఆందోళన చెందోవద్దు. ఆ మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. పిడుగులు పడటం, గ్యాస్ లీక్ అవ్వడం వంటి అత్యవసర సమయాల్లో ప్రజలకు క్షణాల్లో సమాచారం అందించడం దీని ముఖ్య ఉద్దేశం. ముందస్తు హెచ్చరికలు అందడం వల్ల ప్రాణ నష్టం నివారించడానికి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో, సరిహద్దు జిల్లాల్లో ఈ పరీక్ష నిర్వహించడం లేదు. అంటే రీ-పోలింగ్ జరుగుతున్న పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలను దీని నుండి మినహాయించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా ఈ ఆధునిక సమాచార వ్యవస్థను ఈరోజే ప్రారంభించనున్నారు.
