ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌ఓలోకి రికార్డ్‌‌‌‌‌‌‌‌ లెవెల్లో కొత్త మెంబర్లు

ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌ఓలోకి రికార్డ్‌‌‌‌‌‌‌‌ లెవెల్లో కొత్త మెంబర్లు

న్యూఢిల్లీ: భారతదేశంలో ఇన్‌‌‌‌‌‌‌‌ఫార్మల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కార్మికులు నెమ్మదిగా ఫార్మల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి  మారుతున్నారు. 2024–25లో  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌ఓ)లో రికార్డ్ లెవెల్లో 1.40 కోట్ల కొత్త మెంబర్లు చేరారు. 2018–19 లో జరిగిన 61 లక్షల ఎన్‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌తో పోలిస్తే ఇది రెట్టింపు.

హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్ కంపెనీ క్వస్‌‌‌‌‌‌‌‌ కార్ప్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ ప్రకారం, కొత్త ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌ఓ సభ్యుల్లో 61 శాతం మంది 29 ఏళ్ల లోపు వయస్సు కలిగినవారే. వీరిలో సగం మంది 18–25 ఏళ్ల మధ్యవారు. యువత  కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఫార్మల్ జాబ్స్ మొదటి అడుగుగా మారుతున్నాయి. వర్క్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌లో మహిళా కార్మికులు  వాటా 41.7శాతానికి పెరిగింది. ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌ఓ  కొత్త సభ్యుల్లో 25శాతం మంది మహిళలు ఉన్నారు.

రిటైల్, ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌, మాన్యుఫాక్చరింగ్, టెలికాం రంగాలు ఉద్యోగ సృష్టిలో ముందున్నాయి. క్వస్‌‌‌‌‌‌‌‌ సంస్థ ఒక్క రిటైల్‌‌‌‌‌‌‌‌లోనే 1.03 లక్షల మందిని నియమించింది. బీఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఐ  రంగం నెలకు రూ.28,500, రిటైల్ రూ.23 వేల జీతం ఆఫర్ చేస్తోంది. మహిళలు జాబ్‌‌‌‌‌‌‌‌లో జాయిన్ అవ్వడం పెరగాలంటే సురక్షిత వసతి, రవాణా వంటి సామాజిక మౌలిక సదుపాయాలు అవసరమని క్వస్‌‌‌‌‌‌‌‌ పేర్కొంది.