SGT పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

SGT పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

TRT-2017 SGT తెలుగు మీడియం రిక్రూట్  మెంట్  కౌన్సెలింగ్  షెడ్యూల్  విడుదలైంది. SGT తెలుగు మీడియంలో మొత్తం 3786 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్  ఇవ్వగా 3,325 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు విద్యా శాఖకు అందాయి. ఈనెల 23 నుంచి నవంబర్  7 వరకూ పూర్తిస్థాయి కౌన్సెలింగ్  షెడ్యూల్  ను  స్కూల్  ఎడ్యుకేషన్  కమిషనర్  విజయ్ కుమార్  సోమవారం విడుదల చేశారు. షెడ్యూల్  ప్రకారం కౌన్సెలింగ్  నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, డీఈవోలను ఆయన ఆదేశించారు. పాత 10 జిల్లాల ప్రకారం పోస్టింగ్ ఇవ్వాలని సూచించారు ఈనెల 23న అన్ని జిల్లాల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను DEO వెబ్ సైట్లలో, నోటీస్  బోర్డులలో ప్రదర్శించాలని, ఈనెల 28,29 తేదీల్లో ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్  నిర్వహించాలని, అదేరోజు పోస్టింగ్ తో పాటు అపాయింట్  మెంట్  ఆర్డర్స్  అందించాలని సూచించారు.

ఈనెల 23న DEO వెబ్  సైట్లు, నోటీస్ బోర్డులలో సెలెక్టెడ్  అభ్యర్థుల లిస్ట్  పెడతారు. DEOల నేతృత్వంలో ఖాళీలను గుర్తించి… కౌన్సెలింగ్ సెంటర్ వివరాలు ఇస్తారు. 24న జిల్లాల్లో SGT ఖాళీల వివరాలను వెబ్  సైట్ , నోటీస్ బోర్డులలో పెడతారు. 25, 26న అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుంది.  28, 29 తేదీల్లో అభ్యర్థుల  కౌన్సెలింగ్ , పోస్టింగ్  అండ్  అపాయింట్ మెంట్  ఆర్డర్స్  ఇస్తారు. 30న పోస్టింగ్  పొందిన స్కూళ్లలో కొత్త టీచర్ల రిపోర్టింగ్  చేయాల్సి ఉంటుంది.  నవంబర్  2న DEOల ద్వారా రిపోర్ట్  చేయని, జాయిన్  కాని అభ్యర్థుల లిస్ట్ తయారు చేస్తారు.  4న కౌన్సెలింగ్ కు హాజరుకాని అభ్యర్థులకు రిజిస్టర్ పోస్టు ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్స్ పంపిస్తారు. 5న డ్యూటీలో చేరిన టీచర్ల లిస్ట్ ను హెడ్మాస్టర్లు DEOకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ వెంటనే డ్యూటీలో చేరిన టీచర్ల లిస్ట్ ను నోటీస్ బోర్డు/ DEO వెబ్ సైట్ లో పెడతారు.  7న నాన్ రిపోర్టింగ్, నాన్ జాయినింగ్ అభ్యర్థుల జాబితా TSPSC, స్కూల్  ఎడ్యుకేషన్  కమిషనర్  కు అందజేస్తారు.

ఉమ్మడి జిల్లాల వారీగా SGT పోస్టుల వివరాలు చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో 864, హైదరాబాద్ జిల్లాలో 115, కరీంనగర్ లో 15, ఖమ్మంలో  75, మహబూబ్ నగర్ లో 1067, మెదక్ లో 505, నిజామాబాద్ లో 112, రంగారెడ్డి 542, వరంగల్ లో 30 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు.