ప్లాస్టిక్‌‌ రోడ్లు వేస్తం… ముందుకొచ్చిన రిలయన్స్​

ప్లాస్టిక్‌‌ రోడ్లు వేస్తం… ముందుకొచ్చిన రిలయన్స్​

రాయ్‌‌గడ్‌‌ : వేస్ట్‌‌ ప్లాస్టిక్‌‌తో రోడ్లు వేసే టెక్నాలజీ అందిస్తామంటూ రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ లిమిటెడ్‌‌ (ఆర్‌‌ఐఎల్‌‌) నేషనల్‌‌ హైవేస్‌‌ అథారిటీ ఆఫ్‌‌ ఇండియా (ఎన్‌‌హెచ్‌‌ఏఐ)కి ప్రతిపాదించింది. ఈ టెక్నాలజీతో పైలట్‌‌ ప్రాజెక్టును సక్సెస్‌‌ఫుల్‌‌గా పూర్తి చేశామని ఆర్‌‌ఐఎల్‌‌ తెలిపింది. 50 టన్నుల వేస్ట్‌‌ ప్లాస్టిక్‌‌ను బిటుమిన్‌‌తో కలిపి 40 కిమీ మేర రాయ్‌‌గడ్‌‌ సమీపంలోని నాగోథానె మాన్యుఫాక్చరింగ్‌‌ సైట్‌‌ వద్ద  ఈ ప్లాస్టిక్‌‌ రోడ్డును రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ వేసింది. టెక్నాలజీ డెవలప్‌‌ చేయడానికి తమకు 14 నుంచి 18 నెలల టైం పట్టిందని, శ్నాక్స్‌‌ ప్యాకేజింగ్‌‌, పాలిఎథిలిన్‌‌ బ్యాగ్స్‌‌ వంటి వేస్ట్‌‌ ప్లాస్టిక్‌‌ ఉపయోగించి ఆ రోడ్డును వేశామని రిలయన్స్‌‌ తెలిపింది. మా అనుభవాన్ని ఎన్‌‌హెచ్‌‌ఏఐతో పంచుకుంటున్నామని, రోడ్ల నిర్మాణంలో వేస్ట్‌‌ ప్లాస్టిక్‌‌ వినియోగం గురించి తెలియ చేస్తున్నామని రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ సీఓఓ (పెట్రో కెమికల్స్‌‌ బిజినెస్‌‌) విపుల్‌‌ షా వెల్లడించారు.

ఎన్‌‌హెచ్‌‌ఏఐతోపాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, లోకల్‌‌ బాడీస్‌‌తోనూ ఈ టెక్నాలజీపై చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇక రీసైకిల్‌‌ చేయడానికి సాధ్యం కాని ప్లాస్టిక్‌‌ వేస్ట్‌‌ను ఎండ్‌‌ ఆఫ్‌‌ ప్లాస్టిక్‌‌గా వ్యవహరిస్తారు. అలాంటి వేస్ట్‌‌ ప్లాస్టిక్‌‌తోనే తాము ఈ టెక్నాలజీ డెవలప్‌‌ చేసినట్లు తెలిపారు. ఈ టెక్నాలజీతో రోడ్లు వేయడం మరీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదేమీ కాదని పేర్కొన్నారు. ఒక కిమీ రోడ్డుకు 1 టన్ను వేస్ట్‌‌ ప్లాస్టిక్‌‌ సరిపోతుందని, బిటుమిన్‌‌కు ప్రత్యామ్నాయంగా దానిని వాడటం వల్ల దాదాపు లక్ష రూపాయలు ఆదా అవుతుందని వివరించారు. ఇంకో విధంగా చెప్పాలంటే బిటుమిన్‌‌ వినియోగం 8 నుంచి 10 శాతం తగ్గుతుందన్నారు. రెండు నెలల్లోనే తమ పైలట్‌‌ పూర్తయిందని, కిందటేడాది వర్షాలను ఈ రోడ్లు తట్టుకోగలిగాయని షా వివరించారు. ఐతే, వేస్ట్‌‌ ప్లాస్టిక్‌‌ను సేకరించడం, వేరు చేయడమనేది పెద్ద సవాలని ఆర్‌‌ఐఎల్‌‌ బిజినెస్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ హెడ్‌‌ కే ఆర్‌‌ ఎస్‌‌ నారాయణ్‌‌ చెప్పారు. టెక్నాలజీ మాత్రం తాము అందించగలమని చెప్పారు. టెక్నాలజీని కమర్షియలైజ్‌‌ చేసే దిశలో ఇంకా ఏమీ ఆలోచించలేదని స్పష్టం చేశారు. మార్కెట్‌‌ను అర్ధం చేసుకున్నాక ఒక నిర్ణయానికి వస్తామన్నారు.
మరిన్ని వార్తలు…
ముస్లిం మహిళలు మసీదులో ప్రార్థనలు చేయవచ్చు
CAA వ్యతిరేక నిరసన కారులపై కాల్పులు.. ఇద్దరు మృతి
లంచం ఇవ్వలేదని చెప్పుతో కొట్టిన మహిళా ఆఫీసర్
నీళ్లకు ఎక్స్‌‌పైరీ డేట్‌‌ ఉందా?