కరోనా మహమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వంతు సాయం చేసింది. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి (CMRF) రూ .5 కోట్ల విరాళాన్ని అందజేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) . జియో తెలంగాణ సీఈఓ కేసీ రెడ్డి, ఆర్ఐఎల్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి కమల్ పొట్లపల్లి… ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి ఈ విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. కోవిడ్ -19 కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే PM-CARES సహాయ నిధికి రూ. 530 కోట్లు అందించింది. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5కోట్లు విరాళం అందించడంతో కేటీఆర్.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి కృతజ్ఞతలు చెప్పారు.
