హైదరాబాద్​లో జియో ట్రూ 5 జీ

హైదరాబాద్​లో జియో ట్రూ 5 జీ

హైదరాబాద్​, వెలుగు: జియో ట్రూ 5జీ సేవలు గురువారం నుంచి హైదరాబాద్​లో అందుబాటులోకి తెచ్చినట్లు రిలయన్స్​ జియో ప్రకటించింది. ఇప్పటికే  ముంబై, ఢిల్లీ, కోల్​కతా, చెన్నై, వారణాసి, నాథ్​ద్వారా (రాజస్థాన్‌) లలో అందుబాటులో ఉన్న జియో ట్రూ5జీ సేవలను ఇప్పుడు హైదరాబాద్​, బెంగళూరులలో లాంఛ్​ చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

ఈ ఆరు సిటీలలోని లక్షలాది మంది కస్టమర్లు సర్వీస్​ను ఎక్స్​పీరియన్స్​ చేస్తున్నారని, జియో వెల్​కం ఆఫర్​ను ఉపయోగించుకోవాలని ఇక్కడి కస్టమర్లను రిలయన్స్​ జియో కోరింది. ఈ ఆఫర్​ కింద 1 జీబీపీఎస్​స్పీడ్​తో అన్​లిమిటెడ్​ 5జీ డేటా పొందవచ్చని పేర్కొంది. కస్టమర్లు ఇచ్చే ఫీడ్​బ్యాక్​ తమకు బాగా ఉపయోగపడుతోందని 
వివరించింది.