ఒకసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు

ఒకసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన డెట్రాయిట్‌ ఇంజినీర్డ్‌ ప్రొడక్ట్‌(డీఈపీ) తన ఎలక్ట్రిక్‌ స్కూటర్ ను గురువారం ఇండియాలో లాంచ్‌ చేసింది. రి మూవబుల్‌ బ్యాటరీస్‌ ఉండడంతో ఇళ్లలోనైనా, పబ్లిక్ ప్లేస్‌ల లోనైనా చార్జింగ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 150 కి.మీ వరకు వస్తుందని, గంటకు 0–60 కి.మీ స్పీడ్ ను ఏడు సెకన్లలోనే అందుకుంటుందని డీఈపీ తెలిపింది.