500 స్టీల్ గిన్నెల‌తో చంద్రయాన్ 3 నమూనా.. విజ‌యీ భ‌వ అంటూ ఆర్ట్

500 స్టీల్ గిన్నెల‌తో చంద్రయాన్ 3 నమూనా.. విజ‌యీ భ‌వ అంటూ ఆర్ట్

చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అవ్వాలని  సగటు భారతీయుడు కోరుకుంటున్నాడు. సోషల్ మీడియా వేదికగా ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో భాగంగా ప్రముఖ ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఇస్రో ప్రయోగం సక్సెస్ కావాలంటూ కొత్త ఆర్ట్‌ వేశాడు. చంద్రయాన్‌ 3 కి సంబధించిన డిజైన్‌ని 22 అడుగుల పొడవులో ఇసుకతోనే బొమ్మ గీశాడు. వాటిపై దాదాపు 500 స్టీల్ బౌల్స్, డిషెస్ అమర్చాడు. విజయీభవ అని సందేశం కూడా ఇచ్చాడు. ఒడిశాలోని పూరీ బీచ్‌లో ఈ ఆర్ట్ వేశాడు సుదర్శన్ పట్నాయక్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

ALSOREAD:చంద్రయాన్ 3 రాకెట్ స్పేర్ పార్ట్స్ హైదరాబాద్ లో తయారీ

#WATCH | Renowned sand artist Sudarsan Pattnaik created a 22 ft long sand art of Chandrayaan 3 with the installation of 500 steel bowls with the message "Bijayee Bhava", at Puri beach in Odisha, yesterday.

The Indian Space Research Organisation's third lunar exploration mission,… pic.twitter.com/Gr4SNEZDEy

— ANI (@ANI) July 13, 2023

ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన  చంద్రయాన్‌-3   విజయవంతంగా జాబిల్లి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది.  2023 జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌.. దీనిని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. మూడు దశలను పూర్తి చేసుకున్న చంద్రయాన్‌-3 జాబిల్లి దిశగా ప్రయాణం ప్రారంభించింది. 2023 ఆగస్టు 23 లేదా 24న ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి.. ల్యాండర్‌, రోవర్‌తో కూడిన మాడ్యూల్‌ విడిపోతుంది. అది గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకెళుతుంది. నాలుగు ఇంజిన్ల సాయంతో వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది.