నిస్సహాయ స్థితిలోనే ప్రవల్లిక ఆత్మహత్య: రేణుకా చౌదరి

నిస్సహాయ స్థితిలోనే ప్రవల్లిక ఆత్మహత్య: రేణుకా చౌదరి

హైదరాబాద్, వెలుగు: ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోనే ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆమె గాంధీభవన్​లో నిరుద్యోగులతో సమావేశమయ్యారు. అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. అప్పులు చేసి మరీ తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తున్నారని చెప్పారు.

మాటలకు జీఎస్టీ లేదు కాబట్టి కేసీఆర్​ అన్నీ సొల్లు కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. ఐటీ కింగ్​ అని చెప్పుకునే కేటీఆర్​.. టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీకి బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు. బంగారు తెలంగాణ అంటూ పిల్లల బతుకులను ఆగం చేస్తున్నారని ఫైర్​ అయ్యారు.

టీఎస్​పీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. నిరసన వ్యక్తం చేస్తుంటే విద్యార్థులని కూడా చూడకుండా పోలీసులు వారిని చావబాదారని ఆరోపించారు.  విద్యార్థుల ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్​తన పార్టీ పేరు మార్చి..జాతకం, గోత్రం మార్చుకున్నారని రేణుకా చౌదరి ఎద్దేవా చేశారు.