పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ అవుతున్నారు. మే 2వ తేదీ అంటే రేపు.. 15 పోలింగ్ బూతుల్లో రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం.. మే 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రకటించింది.
24 పరగణాల జిల్లా పరిధిలోని డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో.. అదే విధంగా మగ్రాహట్ నియోజకవర్గంలో ఈ రీ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ బూతుల్లో రీ పోలింగ్ కు ఆదేశించింది ఎన్నికల సంఘం. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది.
West Bengal Elections 2026 | Repolling to be held on 11 booths of Magrahat Paschim Assembly constituency and 4 booths of Diamond Harbour Assembly constituency in South 24 Parganas tomorrow, 2nd May. pic.twitter.com/VbtnepLWvG
— ANI (@ANI) May 1, 2026
రీ పోలింగ్ కు కారణం ఏంటీ :
డైమండ్ హార్బర్ నియోజకవర్గం అనేది తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి పట్టున్న ఏరియా ఇది. ఈ నియోజకవర్గంలోని ఫల్తా ఏరియాలోని పోలింగ్ బూతుల్లో EVM బటన్లను తారుమారు చేశారని బీజేపీ పార్టీ కంప్లయింట్ చేసింది. దీనిపై విచారణ చేసిన ఎన్నికల సంఘం.. ఫల్తాలో రీ పోలింగ్ కు ఆదేశించింది.
- ఈ రెండు నియోజకవర్గాల్లో 15 పోలింగ్ బూతుల్లో 2వ తేదీ అంటే రేపు రీ పోలింగ్ జరగనుంది.
- ఏప్రిల్ 29వ తేదీ పోలింగ్ ముగిసింది. మే 1వ తేదీ సాయంత్రం నిర్ణయం తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది.
- మరికొన్ని గంటల్లోనే రీ పోలింగ్ జరగనున్న క్రమంలో.. ఈ రెండు నియోజకవర్గాల్లోని ఎన్నికల అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
- ఇక పార్టీలు అయితే అప్రమత్తం అయ్యాయి. డైమండ్ హార్బర్, మగ్రాహట్ నియోజకవర్గాల పార్టీ అభ్యర్థులు అలర్ట్ అయ్యారు. స్థానిక నేతలను అప్రమత్తం చేశారు.
