V6 News

బెంగాల్ లో  77 బూత్ల లో రీపోలింగ్..!

బెంగాల్ లో  77 బూత్ల లో రీపోలింగ్..!
  • అక్రమాలు జరిగాయని ఈసీకి ఫిర్యాదులు చేసిన వివిధ పార్టీలు

కోల్​కతా: బెంగాల్‌‌‌‌‌‌‌‌లోని 77 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌‌‌‌‌‌‌‌కు విజ్ఞప్తులు అందాయి. పోలింగ్ సమయంలో జరిగిన కొన్ని అక్రమాలు, హింసాత్మక ఘటనలపై వివిధ పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఈవీఎంలను తారుమారు చేశారని, కొన్ని యంత్రాలపై టేపులు అంటించారని, మగ్రాహట్ పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్ల చొక్కా జేబులకు చిన్న కెమెరాలను అమర్చి, వారు ఎవరికి ఓటు వేస్తున్నారో పర్యవేక్షించారని, బూత్ క్యాప్చరింగ్ తోపాటు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించాయి. 

దక్షిణ 24 పరగణాల జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ఫాల్టా నుంచి 32, డైమండ్ హార్బర్  29, మగ్రాహట్​13, బడ్జ్ బడ్జ్ నుంచి 3 కంప్లైంట్స్​వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే, క్షేత్రస్థాయిలో ఏం జరిగిందనే దానిపై సమగ్ర విచారణ జరిపిన తర్వాతే  రీపోలింగ్ నిర్వహించాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఈసీ స్పష్టం చేసింది.