సోషల్ వర్క్ విద్యలో పరిశోధనలు ​జరగాలి: చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి

సోషల్ వర్క్ విద్యలో పరిశోధనలు ​జరగాలి: చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి

సికింద్రాబాద్​, వెలుగు : సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా సోషల్ వర్క్ విద్యలో  పరిశోధనలు జరగాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్​ ప్రొఫెసర్​ లింబాద్రి పేర్కొన్నారు. అధ్యాపకులు  ఆ దిశగా బోధించాలని ఆయన సూచించారు. సికింద్రాబాద్​లోని ఓయూ పీజీ కాలేజీలో రెండ్రోజుల పాటు నిర్వహించిన   సింపోజియం ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. చీఫ్​గెస్టుగా  హాజరైన లింబాద్రి  మాట్లాడుతూ.. .

సోషల్ వర్క్ విభాగ అధ్యాపకులు సామాజిక స్పృహ, అంకితభావంతో బోధించినప్పుడే స్టూడెంట్లు రాణించగలుగుతారని సూచించారు. శాస్త్రీయ పరిశోధన దృక్పథంతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలన్నారు.  కాలేజీ ప్రిన్సిపాల్  ​అర్జున్ ​రావు,   సోషల్ వర్క్ విభాగం హెడ్ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.