
ఎల్బీ నగర్, వెలుగు: బురద నీటిలో నిల్చొని బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్లోని పాపిరెడ్డి కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. తమ కాలనీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీకి అన్నిరకాల పన్నులు కడుతున్నా.. కనీస సదుపాయాలు కల్పించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారని కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీశైలం విమర్శించారు.
వానాకాలం దృష్ట్యా వరద చేరకుండా సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మించి, శానిటేషన్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కాలనీ వాసులు బాలునాయక్, సోమయ్య, సుదర్శన్ రెడ్డి, రాఘవేందర్, వెంకటేశ్వర్ రావు, ఉదయశ్రీ,ఉమాపతి, సాంబయ్య, దేవదాసు పాల్గొన్నారు.