- ఆఖరి రోజులు అక్కాచెల్లెళ్లతో గడిపి.. రైల్వే స్టేషన్లో మృతి
పద్మారావునగర్, వెలుగు: ఓ రిటైర్డ్ కోర్టు ఉద్యోగి అందరూ ఉన్నా అనాథగా సఫిల్‌గూడ రైల్వే స్టేషన్లో గడిపి మృతి చెందాడు. జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి ప్లాట్‌ఫాం నం.1 పై ఓ వ్యక్తి పడుకొని నిద్రలో మృతి చెందాడు.
రైల్వే సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించగా, మృతుడిని నల్గొండ జిల్లా అమనాబోల్కు చెందిన ఇబ్రహీం(66)గా గుర్తించారు. ఆయన పదేండ్లుగా భార్యతో వేరుగా జీవిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. వారి కుటుంబం ప్రస్తుతం కెనడాలో నివసిస్తోంది. ఆయన స్థానికంగా అక్కాచెల్లెళ్లతో చివరి రోజులు గడిపినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
