భార్యా భర్తలు పెన్షనర్లైతే.. ఒక్కరి నుంచే హెల్త్ వాటా వసూలు చేయాలి : రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్

భార్యా భర్తలు పెన్షనర్లైతే.. ఒక్కరి నుంచే హెల్త్ వాటా వసూలు చేయాలి : రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్
  • సీఎస్ రామకృష్ణారావుకు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో భార్యాభర్తలిద్దరూ పెన్షనర్లుగా ఉన్నట్లయితే.. కేవలం ఒక్కరి పెన్షన్ నుంచి మాత్రమే 1.5 శాతం వాటా వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

సోమవారం సీఎస్ రామకృష్ణారావును అసోసియేషన్ నేతలు కలిసి హెల్త్ కార్డుల అమలులో పెన్షనర్లకు ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఎస్ పేర్కొన్నారు.