కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్మన్​గా రేవంత్

కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్మన్​గా రేవంత్
  • భట్టి సహా 28 మందికి చోటు 

న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌‌‌‌ హైకమాండ్ ‘ప్రదేశ్‌‌‌‌ ఎలక్షన్ కమిటీ’ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్​గా పీసీసీ చీఫ్ రేవంత్‌‌‌‌ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌‌‌‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 25 మందికి సభ్యులుగా, ముగ్గురికి ఎక్స్‌‌‌‌ అఫీషియో మెంబర్లుగా అవకాశం కల్పించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని అందులో పేర్కొన్నారు. 

కమిటీలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌రెడ్డి, సీనియర్ నేతలు మహేశ్‌‌‌‌కుమార్‌‌‌‌ గౌడ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్‌‌‌‌ కుమార్‌‌‌‌ యాదవ్, జానా రెడ్డి, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజ నర్సింహ, మధు యాష్కీ గౌడ్, దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌ బాబు, వంశీచంద్‌‌‌‌ రెడ్డి, సంపత్‌‌‌‌ కుమార్, రేణుకా చౌదరి, బలరాం నాయక్, పొదెం వీరయ్య, సీతక్క, షబ్బీర్‌‌‌‌ అలీ, పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి, ప్రేమ్‌‌‌‌సాగర్‌‌‌‌ రావు, సునీ తారావు సభ్యులుగా ఉన్నారు. ఇక ఎక్స్ అఫీషియో మెంబర్లుగా యూత్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, సేవాదళ్‌‌‌‌ రాష్ట్ర ముఖ్య నిర్వాహకుడు ఉన్నారు.