కిషన్రెడ్డి సొంతూరిలోనూ భూదాన్ భూముల దోపిడీ :సీఎం రేవంత్రెడ్డి 

కిషన్రెడ్డి సొంతూరిలోనూ భూదాన్ భూముల దోపిడీ :సీఎం రేవంత్రెడ్డి 
  • కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి సొంత గ్రామమైన కందుకూరు మండలం 

తిమ్మాపూర్‌‌లోని 77 ఎకరాల భూదాన్‌‌ భూముల దోపిడీని, దాని చుట్టూ కొందరు మహిళా నేతలు చేస్తున్న విమర్శలను రేవంత్‌‌రెడ్డి తిప్పికొట్టారు. తిమ్మాపూర్‌‌లోని 14 వివిధ సర్వే నంబర్లలో (సర్వే నంబర్లు 6, 129, 130, 147, 161, 167, 197, 440, 453, 454, 455, 573, 574, 575) 1955 నుంచి రికార్డుల్లో ఉన్న భూదాన్‌‌ భూములను 2008లో కాపాడాలని కిషన్‌‌రెడ్డి స్వయంగా పోరాడారని గుర్తుచేశారు. అయితే, బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో ధరణి ద్వారా ఆ 77 ఎకరాల భూదాన్‌‌ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేర్లకు మార్చి దొంగ రిజిస్ట్రేషన్లు చేయించారని, 2024లో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం రాగానే కిషన్‌‌రెడ్డి పాత ఫిర్యాదు ఆధారంగా కలెక్టర్‌‌తో విచారణ జరిపించి ఆ రిజిస్ట్రేషన్లను నిలిపివేసి ఎఫ్‌‌ఐఆర్‌‌ నమోదు చేయించామని వివరించారు. 

ఈ అంశంలో తనపై రాజకీయ విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సునీతా రెడ్డిని ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. ‘‘2018 ఎన్నికల్లో సునీతమ్మ కోసం ప్రచారం చేసినం దుకు నాపై కేసీఆర్‌‌ ప్రభుత్వం కేసులు పెడితే, సీఎం అయ్యాక కూడా 2025లో 5 సార్లు స్వయంగా కోర్టుకు వెళ్లి చేతులు కట్టుకొని నిలబడ్డాను. సబితమ్మ కొడుకు ఎంపీ టికెట్‌‌ కోసం కాంగ్రెస్‌‌లో ఉన్నప్పుడు సహాయం చేశాం. అలాంటిది కాంగ్రెస్‌‌ పార్టీ ఇచ్చిన పదవు లతో ఎదిగి, నాడు దళిత నేత భట్టి విక్రమార్క సీఎల్పీ పదవిని ఊడగొట్టి బీఆర్‌‌ఎస్‌‌లోకి ఫిరా యించిన మీరు ఈరోజు నన్ను నిందించడం ధర్మమేనా? దమ్ముంటే బహదూర్‌‌గూడ, తిమ్మా పూర్‌‌ భూములపై ఏసీబీ, విజిలెన్స్‌‌ విచారణ జరపాలని లేఖ రాయండి” అని సవాల్‌‌ విసిరారు.